Moviesఅభిమానుల కోసమే..ఫస్ట్ టైం మహేష్ బాబు నమ్రతతో అలా....పోస్టర్ వైరల్..!!

అభిమానుల కోసమే..ఫస్ట్ టైం మహేష్ బాబు నమ్రతతో అలా….పోస్టర్ వైరల్..!!

టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ కూడా ఒక‌టి. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. అయితే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డ ఈ జంట..ఆ తరువాత కొంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గా ప్రేమించుకుని.. పెద్దలు కు చెప్పి..ఒప్పించుకుని..ఈ జంట ఒకటైంది. వీళ్లకి ఓ పాప..బాబు కూడా ఉన్నరు. ఎంతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీ.

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు మహేష్ మూవీ ముచ్చట్లతో పాటు ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరిద్దరికి సంభందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడో వంశీ సినిమాలో జంటగా తెర పై కనిపించిన ఈ కపుల్స్ ..ఆ తరువాత తెర పై జంటగా కనిపించలేదు. ఈ విషయమై ఇప్ప్టికే వాళ్ల అభిమానులు ఎందరో మరోసారి మహేష్ బాబు నమ్రతలని జంటగా తెర పై చూడాలని.. సినిమాలో కాకపోయినా కనీసం ఓ యాడ్ లోనైన కనిపించమండి అంటూ..కొరుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం బట్టి వీళ్లు అభిమానుల కోరికను తీర్చే పనులో ఉన్నట్లు తెలుస్తుంది. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కూడా కెమెరా ముందుకు రావడం ఆసక్తిగా మారింది. ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ నిమిత్తం మహేష్ మరియు నమ్రతలు కలిసి స్టైలిష్ డ్రెస్సింగ్ లో అదరగొట్టారు. అంతేకాకుండా వీరిద్దరికీ కలిపి మొట్ట మొదటి ఫోటో షూట్ కూడా ఇదే అట. దీనితో ఇపుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news