యువరత్న నందమూరి బాలకృష్ణ, మాస్ మహరాజ్ రవితేజ మధ్య ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాత బాలయ్యతో పోటీ పడి మరీ రవితేజ తన సినిమాలను రిలీజ్ చేయించేవారన్న ప్రచారం కూడా జరిగింది. సంక్రాంతి బరిలో బాలయ్య ఒక్క మగాడు వచ్చినప్పుడే రవితేజ కృష్ణ వచ్చింది. అప్పుడు కృష్ణ సినిమా హిట్ అయ్యింది.
తర్వాత మరోసారి సంక్రాంతికి బాలయ్య పరమవీర చక్ర వస్తే.. రవితేజ మిరపకాయ్ సినిమా వచ్చింది. ఇందులో మిరపకాయ్ సూపర్ హిట్ అయితే పరమవీర చక్ర ప్లాప్ అయ్యింది. ఇవి కాకతాళీయంగా జరిగినా కూడా బయట మాత్రం బాలయ్య వర్సెస్ రవితేజ వార్ గురించి అప్పట్లో చాలా వార్తలే గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వేదికగా వీరు వార్‌కు రెడీ అవుతున్నారు.
మే 28న కరోనా రెండో వేవ్‌కు ముందు బాలయ్య అఖండ, రవితేజ ఖిలాడీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు థియేటర్లు తిరిగి రీ ఓపెన్ అయ్యాక మళ్లీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సారి కూడా యాదృచ్ఛికంగానే ఇప్పుడు అఖండ, ఖిలాడీ ఒకేసారి థియేటర్లలోకి వచ్చేలా ఉన్నాయి. మరి ఈ సారి బాక్సాఫీస్ వార్‌లో బాలయ్య అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఖిలాడీ పోటీకి తట్టుకుని నిలబడుతుందా ? అన్నది చూడాలి.