వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి వచ్చిన అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర, మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అఖిల్ అక్కినేని తాజాగా నటించి విడుదలైన చిత్రం ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మించారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించి..తన అందంతో మరోసారి కుర్రకారుని కట్టిపడేసింది.
భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి. 5 రోజుల్లోనే సినిమా 100 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసింది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్స్ రావడం తీసుకొస్తున్నాడు బ్యాచ్‌లర్. 5వ రోజు కూడా 1.5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. పైగా దీనికి పోటీగా విడుదలైన మహా సముద్రం, పెళ్లి సందడి సినిమాలు తేలిపోవడంతో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కుమ్మేస్తుంది. ఆరేళ్ల కెరీర్లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూసాడు అఖిల్.నిజానికి ఈ విజయాన్ని అఖిల్ కంటే కూడా ఎక్కువగా నాగార్జున ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇప్పుడు ఆ ఆనందం డబుల్ అయ్యింది నాగార్జున కి. ఎందుకంటే కరోనా బ్రేక్ య్తరువాతా నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా యుఎస్‌లో హాఫ్ మిలియన్ మార్కును బద్దలు కొట్టేసింది. ఆ సినిమా అలవోకగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కి చెందిన మరో అక్కినేని కుర్రాడు కూడా యుఎస్ బాక్సాఫీస్‌లో జోరు చూపిస్తున్నాడు. దసరా కానుకగా విడుదలైన అఖిల్ కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కరోనా బ్రేక్ తర్వాత హాఫ్ మిలియన్ మార్కును దాటిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది. కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి వారాంతంలో మంచి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా బుధవారం అర మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టింది. వీకెండ్ అయ్యేసరికే 4.5 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టింది.