కొద్ది రోజులుగా అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తోన్న వార్తల ఉత్కంఠకు ఎట్టకేలకు ఈ రోజు చైతు – సామ్ అధికారికంగా తెరదించేశారు. తమ నాలుగేళ్ల వైవాహిక సంబంధానికి అక్కినేని చైతన్య – సమంత ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో చైతు విడాకులు తీసుకున్నట్టు చెపితే.. సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకుల విషయాన్ని కన్‌ఫార్మ్ చేసింది. చైతు మాత్రం చాలా ఆవేదనతో ఈ విషయాన్ని చెప్పినట్టు అతడి పోస్ట్ చూస్తేనే అర్థమవుతోంది. చాలా చర్చలు , ఆలోచనల తర్వాత సామ్ , నేను సొంత మార్గాలను ఎంచుకోవడానికి భార్యాభర్తలుగావిడిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
మేము ఒక దశాబ్దానికి పైగా స్నేహాన్ని కలిగి ఉండటం అదృష్టంగా బావిస్తున్నానని.. ఎల్లప్పుడూ మా మధ్య ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మేము నమ్ముతున్నాము అంటూ పేర్కొన్నాడు. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు మీడియా మాకు మద్దతివ్వాలని
కోరుకుంటున్నామని.. తాము ముందుకు సాగడానికి అవసరమైన ప్రైవసి ఇవ్వమని అభ్యర్థిస్తున్నాము అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశాడు. చైతు ఈ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
వాస్తవానికి సమంత ఇగోతో పాటు, పట్టుదలకు పోవడం, తానే గొప్ప అన్నట్టుగా వ్యవహరించిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చైతు ఆమెతో రాజీ పడేందుకు ఎంతో ట్రై చేశాడని.. ఎంత తగ్గి ఉన్నా కూడా ఆమె దూకుడు, ఇగో వల్ల చివరకు విసిగిపోయి ఆమెకు దూరం కావాలని నిర్ణయించుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. సమంతతో కలిసి ఉండేందుకు చైతు ఎంత వెనక్కు తగ్గినా కూడా ఆమె తీరు నచ్చకే అక్కినేని ఫ్యామిలీ సైతం తీవ్రంగా విసిగి పోయిందనే అంటున్నారు. ఏదేమైనా పదేళ్ల స్నేహ బంధం.. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పడిపోయింది.
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021