అక్కినేని నాగచైతన్య – సమంత ముందు నుంచి ఊహించినట్టుగానే విడిపోయారు. వీరిని కలిపేందుకు అటు అక్కినేని ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొందరు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉండడంతో వీరు కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. చివరకు విడాకులు తీసేసుకున్నారు. ఈ రోజు నుంచి వీరిద్దరు అధికారికంగా భార్య, భర్తలు కారు.
ఇక తన కుమారుడు, కోడలు కాపురాన్ని నిలబెట్టేందుకు చైతు తల్లి శ్రీ లక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేశారట. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె అయిన శ్రీలక్ష్మిని ముందుగా నాగార్జున వివాహం చేసుకోవడం.. వీరికి నాగచైతన్య జన్మించడం జరిగాయి. ఆ తర్వాత వారిద్దరు కూడా మనస్పర్థలతో విడిపోయారు. అయితే చైతు – సామ్ ప్రేమ వ్యవహారం ముందు నుంచి తెలిసిన శ్రీలక్ష్మి వీరికి పెళ్లి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశారు.
సమంత చైన్నైలో ఉండడం, ఇటు శ్రీ లక్ష్మి కూడా చెన్నైలో ఉండడంతో వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉండేది. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోతున్నారన్న వార్తలతో శ్రీ లక్ష్మి మనస్సు కలత చెందడంతో పాటు కొడుకు – కోడలు కాపురం నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు సమంతను ఎంతో కన్విన్స్ చేసిందట. ఈ విషయంలో సమంత మంకు పట్టు పట్టడంతో పాటు తనపై ఆంక్షలు పెడితే తట్టుకోలేనని తేల్చి చెప్పేసిందట. ఇంత బలవంతంగా కాపురం నిలబెట్టినా సఖ్యత ఉండదనే చివరకు ఆమె కూడా వీరిని కలిపే ప్రయత్నం విరమించుకుందట.