ప్రభాస్, రాజమౌళి..ఇద్దరుకు ఇద్దరు స్టార్ స్టేటస్ కలిగినవారు. ఇండస్టృఈలో తమకంటూ గుర్తింపు ఉండేవారు.ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాసిన సినిమాలు అవి. ఛత్రపతి, బాహుబలి 1,2 బాక్స్ ఆఫిస్ వద్ద ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టేచరే మారిపోయింది. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో ఇదే కాంబినేషన్ లో సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుందనే ఆలోచన అభిమానుల్లో కలగటం సహజం. మరోసారి ఈ పవర్ ఫుల్ సెన్సేషన్ జతకడితే.. భాక్సాఫీస్ ని బంగారు బాతుని చేయాల్సిందే.
అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది అంటూ ప్రచారం జరుగుతోన్న తరుణంలో రాజమౌళి దీని పై క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒక కాలేజ్ ఈవెంట్ లో ఈ ప్రశ్నకి సమాధాన్మ్ ఇచ్చారు. ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ..రిప్లై ఇస్తూ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ఇటీవల తన వరుస సినిమాలను ప్రకటించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఆయనతో మళ్ళీ పని చేసే అవకాశం నాకు ఎప్పటికీ వస్తుందో?” అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
నిజమ్హ్గానే ప్రభాస్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. వాటిని ఫినిష్ చేసి కానీ రాజమౌళి దగ్గరకు రాలేడు. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ తో చేసాకనే..ప్రభాస్ తో ముందుకు వెళ్లాలి. అంటే మరో రెండేళ్లు పట్టచ్చు. ప్రస్తుతం రాజమౌళి ..ఆర్ ఆర్ ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. సుమారు ప్రభాస్ చేతిలో 6,7 బడా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అంటే 2024 చివరి వరకు ప్రభాస్ కాల్షీట్స్ ఫుల్ బిజీ. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్, రాజమౌళి సినిమా ఎప్పుడూ అంటే చెప్పటం కష్టమే.