అక్కినేని అఖిల్‌కు ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రూపంలో హిట్ దక్కింది. రెండేళ్ల పాటు ఊరించి ఊరించి ఎన్నో అవరోధాలు దాటుకుని రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన బ్యాచిలర్‌కు మరీ ఇరగదీసేంత టాక్ అయితే రాలేదు. రెండు వారాలు ముగిసే సరికి కొత్త సినిమాలు రావడంతో చాలా వరకు థియేటర్లను కోల్పోయింది.
బ్యాచిలర్‌కు 13వ రోజు రు. 9 లక్షల షేర్ వచ్చింది. 14వ రోజు రు. 6 లక్షల షేర్ వచ్చింది. ఓవరాల్‌గా రెండు వారాలకు రు. 39 కోట్ల గ్రాస్ రాబట్టుకుంది. ఇప్పటికే సినిమా వసూళ్లు స్లో అయిపోయాయి. ఇక లాంగ్ రన్ అయితే ఉండదు. ఇక రెండు వారాలకు ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 7.50 కోట్లు
సీడెడ్ – 4.10 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.37 కోట్లు
ఈస్ట్ – 1.22 కోట్లు
వెస్ట్ – 99 లక్షలు
గుంటూరు – 1.38 కోట్లు
కృష్ణా – 1.11 కోట్లు
నెల్లూరు – 83 లక్షలు
======================
ఏపీ+తెలంగాణ = 19.41 కోట్లు
======================
రెస్టాఫ్ ఇండియా – 1.49 కోట్లు
అధర్ ఏరియాస్, ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే రు. 39 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమాను రు. 18.5 కోట్లకు అమ్మితే రెండు వారాల తర్వాత రు. 4.28 కోట్ల లాభం దక్కించుకుంది.