అవును.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మిదే హాట్ టాపిక్ గా మారింది. ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ అనే సినిమాతో టాలీవుడ్ లోను మల్టీ స్టారర్ సినిమాలు చెయచ్చు స్ని నిరూపించుకున్న డైరెక్టర్. మహేష్ బాబు, వెంకటేష్‌లను సిల్వర్ స్క్రీన్‌పై చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీ మల్టీస్టారర్ చిత్రాలకు మరోసారి ఊపుతెచ్చింది ఈ సినిమా.
ఇక ఆ తరువాత టాలీవుడ్ అర కొర మల్టీ స్టారర్ సినిమాలు వచ్చినా.అవి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఇక మరి కొద్ది రోజుల్లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మచ్ అవెయిటెడ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ అనే బిగ్ మల్టీ స్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్.. యంగ్ టైగర్ తారక్.. ఈ సినిమాల్లో నటిస్తుండడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ కానుంది. అయితే ఇప్పుడు తెర పై కి మరో బిగ్ మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. యస్.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. స్టోరీలైన్ ఏంటి? మిగతా నటీనటులు ఎవరన్న విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదు కానీ.. వీరి కాంబో సెట్ అయినట్లు మాత్రం వారత్లు షికారు చేస్తున్నాయి.
సాధారణంగా తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు రావడం చాలా అరుదు. ఒకవేళ వస్తే మాత్రం.. దానిపై అంచనాలు మామూలుగా ఉండవు. అలాంటిది.. ఒకరు మెగాస్టార్, స్టలీష్ స్టార్, ఇంకొకరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఈ ముగ్గురు కలిస్తే ఏమైనా ఉంటుందా? బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. రికార్డుల మోత మోగిపోవాల్సిందే. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుందనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఎందుకంటే.. చిరు ఆల్రెడీ తన మూడు ప్రాజెక్టుల్ని వెల్లడించేశారు. మరోవైపు.. అల్లు అర్జున్ కూడా వరుసగా సినిమాలకు సైన్ చేసుకుంటున్నాడు. ఇలా ఇద్దరు రెండేసి ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఈ లెక్కన.. ఈ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ ఈ సంవత్సరంలో అసలు ఉండదు. వచ్చే ఏడాదిలోనే సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ కనిపించడం లేదుది. అంటే.. ఈ సినిమా కోసం చాలాకాలం వెయిట్ చేయాల్సిందే.