అక్కినేని ఫ్యామిలీకి మూలస్తంభం దివంగత ఏఎన్నార్. ఆయన తర్వాత ఇప్పుడు రెండో తరంలో ఆయన వారసుడు నాగార్జున కూడా తెలుగులో స్టార్ హీరో అయ్యాడు. ఇక ఇప్పుడు మూడో తరంలోనూ ఆయన మనవళ్లు, మనవరాళ్లు కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే ఎందుకో కాని అక్కినేని ఫ్యామిలీకి పెళ్లి అనే పదం కలిసి రాలేదు. నాగార్జున ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య పుట్టాక మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు అప్పట్లో సంచలనం.
తర్వాత నాగార్జున అమలను పెళ్లాడితే.. శ్రీలక్ష్మి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక మూడో తరంలోనూ అక్కినేని ఫ్యామిలీ పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. నాగార్జున ఇద్దరు కుమారుల్లో నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మోస్ట్ రొమాంటిక్ కఫుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట నాలుగేళ్ల సంసారం తర్వాత విడిపోయింది. ఇప్పుడు ఎవరి దారి వారిది అయిపోయింది. ఇక నాగ్ చిన్న కుమారుడు అఖిల్‌కు ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది.
ఇటలీలో అంగరంగ వైభవంగా వీరి వివాహానికి ఏర్పాట్లు కూడా చేశారు. అంతలోనే ఓ ఫంక్షన్లో చిన్న మాటతో ఏర్పడిన గ్యాప్ క్రమంగా పెద్దది అయ్యి.. చివరకు వీరు విడాకులు తీసుకునే వరకు వెళ్లింది. ఇక ఏఎన్నార్ కుమార్తె పిల్లలు అయిన యార్లగడ్డ సుమంత్, సుప్రియ పెళ్లిళ్లు కూడా పెటాకులు అయ్యాయి. సుమంత్ తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లాడిన యేడాదికే విడాకులు ఇచ్చేశారు. వీరి విడాకులు అప్పట్లో ఎంతో మందిని హర్ట్ చేశాయి.
తర్వాత కీర్తిరెడ్డి మరో వ్యక్తిని పెళ్లాడి ఇద్దరు పిల్లలను కని అమెరికాలో సెటిల్ అయ్యింది. సుమంత్ మాత్రం ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. సుమంత్ సోదరి సుప్రియ కూడా ఇష్టం హీరో చరణ్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత చరణ్‌తో ఆమె విడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే చరణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక సుప్రియ సినిమాల్లో నటిస్తూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఏదేమైనా అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికి మధ్య ఏదో వైరుధ్యం ఉన్నట్టే ఉంది.