మా ఎన్నికలలో సినిమాబిడ్డలం తరపున పోటీ చేసి గెలిచిన ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్ సభ్యులు 11 మంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీనిపై మంగళవారం సాయంత్రం టోటల్‌గా ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్ సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టి మంచు విష్ణు ఫ్యానెల్‌తో పాటు మోహన్‌బాబుపై, నరేష్‌పై, మా ఎన్నికలు జరిగిన తీరుపై తప్పు పట్టారు.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ మాట్లాడుతూ ఆ రోజు మోహన్‌బాబు అన్న మాటలు ఎంతో బాధ కలిగించాయన్నారు. అక్కడ విష్ణు మా అధ్యక్షుడిగా పోటీ చేశారని.. కానీ మోహన్‌బాబు తీరు చూస్తే ఆయనే మా అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు ఉందన్నారు. ఇక బెనర్జీని మోహన్‌బాబు అలా తిడుతుంటే బెనర్జీ ఎంతో సంయమనంతో వ్యవహరించారని.. ఆ టైంలో ఆయన్ను చూస్తే తనకే ఎంతో బాధ కలిగించిందని ప్రభాకర్ చెప్పాడు.
అయితే ఆ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉన్నా కూడా మనోజ్ అందరిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారని.. మనోజ్ తమ్ముడు లేకపోతే పెద్ద యుద్ధమే జరిగిపోయి ఉండేదని .. థ్యాంక్యు యు మనోజ్ తమ్ముడు అంటూ మనోజ్‌ను ప్రశంసించాడు. ఇక విష్ణు మా అధ్యక్షుడిగా మంచి పాలన ఇవ్వాలని ప్రభాకర్ ఆకాంక్షించారు.