మా ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఒకర్నొకరు ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ.. శాపనర్దాలు పెట్టుకుంటున్నారు. మీడియా ముఖంగా కన్నీళ్లు కారుస్తున్నారు. సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ మాదిరి డ్రామాని తెగ పండించేస్తున్నారు. మా ఎన్నికల్లో తలపడు తోన్న ప్రకాష్ రాజ్ ఫ్యానెల్, మంచు విష్ణు ఫ్యానెల్ హోరా హోరీగా రాజకీయ ప్రచారం చేస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది.
అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్నది ఈ నెల 10న తేలిపోనుంది. అయితే ముందస్తు అంచనాలు , ఆన్ లైన్ సర్వే లు మాత్రం ప్రకాష్ రాజ్ కు అనుకూలంగా వస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్నిక లలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. జీవితా రాజశేఖర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఓ పార్టీ లో తాను జూనియర్ ఎన్టీఆర్ ను కలిశానని. .అప్పుడు తాను ఓటు వేయమని అడిగితే.. ఎన్టీఆర్ తాను ఓటింగ్ కు రానని. ప్రస్తుతం మాలో జరుగుతున్న పరిణామాలు తనకు చాలా బాధగా ఉన్నాయని అన్నారట. ఈ విషయాన్ని జీవితా రాజశేఖర్ బహిరంగంగానే ఓ ప్రెస్ మీట్లో చెప్పేశారు.
ఇక మంచు విష్ణు దీని పై స్పందిస్తూ.. ఓ ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. తారక్ తనకే ఓటు వేస్తానని చెప్పాడని అన్నారు. దీంతో మళ్లీ ఈ వ్యాఖ్యాల పౌ జీవిత స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పారు. జీవిత తను మీడియాతో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని, ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. తను ఎన్టీఆర్ నిరాసక్తత గురించి చెప్పిన విషయం మా మెంబర్లను తప్పుదోవ పట్టిస్తుందని అంగీకరించారు. ఎన్టీఆర్ కాజువల్ గా చర్చించిన విషయాలను తను మీడిమా ముందు వెల్లడించటం సమస్యగా మారిందని జీవిత మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు.