రకుల్ ప్రీత్ సింగ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్క్ర్లేదు. తన నటనతో అంతో మంది అభిమానులని సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ. ఇక రీసెంట్ గా తన బర్త డే జరుపుకున్నా ఈ అమ్మాడు..తన అభిమానులందరికి పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొంత కాలంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమాయాణం నడిపిన రకుల్ తాజాగా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం ప్రకటించిన వెంటనే కృతి సనన్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ ఆయుష్మాన్ ఖురానాతో పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు.
అయితే త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న రకుల్- జాకీ భగ్నానీలకు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ జాతకాలను చూసి .. ఈ జంట పెళ్లి జరగడం అసాధమని చెప్పారట. ఒకవేళ ఈ జంట మొండి గా వెళ్లినా..నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుందట. ఒకవేళ పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని.. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు రకుల్ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం కూడా ఉందట.
ఇక రకుల్‌ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు. జాకీ భగ్నానీది మకర రాశి అని, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. గతంలో సమంత- నాగచైతన్యల వివాహానికి సంబంధించి వేణుస్వామి చెప్పింది నిజమైంది. భార్యభర్తలుగా ఇక కొనసాగలేమంటూ చై-సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి రకుల్ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.