కీర్తి సురేష్.. ఈ పేరుకన్నా ఆమెకి మహానటి అనే పేరు నే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమా విడుదలైయే వరకు ఆమె ఒక్క హీరోయిన్ గానే తెలుసు కానీ, ఆ సినిమా తరువాత ఆమె మహానటి సావిత్రి నే అయిపోయింది. అంతలా మనల్ని తన నటన తో ఆకట్టుకుంది ఈ కీర్తి పాప. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇక ఈ సినిమాతోనే ఆమెకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం లభించింది.
కీర్తి సురేశ్ .. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్ ‘అన్నాత్తే’ మొదలైన సినిమాతో కెరీర్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు కీర్తి బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట , భోళా శంకర్ చిత్రాలలో కీర్తి లుక్‌కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఇవి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సర్కారు వారి పాట చిత్రం సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించారు.
కీర్తి సురేశ్ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన మేనక కూతురు అన్న విషయం అందరికి తెలిసిందే. కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది. ఇక ఈమె తనదైన స్టైల్లో స్టోరీలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను కట్టిపడేఅస్తుంది. కీర్తి బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది.