కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య కొద్ది సేపటి క్రితమే పూర్తైయాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరిని కలచి వేస్తుంది. అక్టోబర్ 29 ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటురావడంతో… కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమించడంతో.. హాస్పిటల్ లోనేచికిత్స పొందుతూ కన్నుమూశారు .
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు కంఠీరవ స్టూడియోలో నిర్వహించరు. తల్లిదండ్రుల సమాధివద్దనే పునీత్ రాజ్ కుమార్ కు కూడా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంత్యక్రియలకు కర్ణాటక సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు.
ఉదయం 4.40 కే అంతిమ యాత్ర మొదలయింది. పునీత్ ను కడసారి చూసుకోవడానికి అభిమానులు బారులు దీరారు. రాఘవేంద్ర కుమారుడు వినయ్ చేతుల మీదుగానే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మృతి దక్షిణాది సినీ పరిశ్రమనే కాదు అభిమానులను కూడా తీవ్ర శోక సంద్రంలో ముంచింది. అమెరికాలో ఉన్న పునీత్ తనయ ధృతి వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించడంతో.. ఈరోజు పునీత్ అంత్యక్రియలు ప్రభత్వం అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.