ఎస్ ఇప్పుడు ఇదే మాట ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. విడాకుల తర్వాత ఆమె కెరీర్ ఎలా ? ఉండబోతుందన్నదే చర్చ నడుస్తోంది. బాలీవుడ్లో ఇవి కామన్.. అక్కడ ఆమెకు అవకాశాలు వచ్చినా రావచ్చు.. పైగా ఆమెకు అక్కడ పెద్ద మార్కెట్ లేదు. కోలీవుడ్లో ఛాన్సులు వచ్చినా ఇది వరకు అంత క్రేజ్ ఆమెకు ఉండదు. ఆమె విడాకుల ప్రభావం అక్కడ కూడా ఉందనే తెలుస్తోంది.
ఇక తెలుగులో మాత్రం ఇప్పుడు ఆమె నాగచైతన్య మాజీ భార్య, పైగా సీనియర్ హీరో నాగార్జునకు మాజీ కోడలు అయిపోయింది. తెలుగు వాళ్లకు అక్కినేని ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో పాటు ఈ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఉన్న గ్రిప్ గురించి తెలిసిందే. ఇక్కడ ఎవరైనా స్టార్ హీరోలు, దర్శకులు ఆమెకు ఛాన్స్ ఇవ్వాలంటే అక్కినేని ఫ్యామిలీతో ఉన్న మొహమాటాల నేపథ్యంలో కాస్త వెనకా ముందు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అప్పుడు ఆమెకు ఇక్కడ స్టార్ హీరోల సినిమాల్లోనూ, క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు రావనే అంటున్నారు.
ఏదైనా సమంత పట్టుదలకు పోతే చిన్నా చితకా అవకాశాలు మినహా ఆమెకు ఒరిగేదేం ఉండదనే అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు కూడా ఆమెను పిలిచి ఛాన్స్ ఇవ్వరు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు సమంత అంటే ప్రొఫెషనల్ గా ఇష్టం అయినా అక్కినేని ఫ్యామిలీ కంటే వాళ్లకు సమంత ఏ మాత్రం ఎక్కువ కాదు. ఏదేమైనా ఇన్ని ప్రతిబంధకాల మధ్య సమంత తెలుగులో పూర్వవైభవం సాధించడం చాలా కష్టం.