తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఈ ఓటింగ్‌లో అధ్యక్షుడితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరికి 26 ఓట్లు ఉంటాయి. మొత్తం పోలు అయిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు విజేత అవుతారు. అధ్యక్షుడు అయినా, ఈసీ అయినా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే ముందు రెండు వేర్వేరు ఫ్యానెల్స్ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారు. అయితే గెలిచాక అందరూ ఒకే ఫ్యానెల్‌గా… అంటే ఒకే టీంగా మారిపోయి పనిచేస్తారు.
మా అధ్యక్షుడిగా ఎవరు అయితే గెలుస్తారో ? అతడి ఆధ్వర్యంలోనూ అందరూ పని చేయాల్సి ఉంటుంది.
2015లో ఏం జరిగింది…
మా ఎన్నికలు గత మూడు, నాలుగు టర్మ్‌ల నుంచే పూర్తి రచ్చగా మారుతున్నాయి. 2015లో సాధారణ ఎన్నికలను గుర్తు చేసేలా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పోరులో రాజేంద్రప్రసాద్ గెలిచారు. అప్పుడు 702 మంది సభ్యుల్లో 394 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజేంద్రప్రసాద్‌కు 237 ఓట్లు, జయసుధ 152 ఓట్లు రాగా 85 ఓట్లతో జయసుధ విజయం సాధించింది.
ఇక 2017 – 19 కాలానికి మా అధ్యక్షుడిగా 783 మంది అసోసియేషన్ సభ్యులు శివాజీరాజాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇదే ఫ్యానెల్లో జనరల్ సెక్రటరీగా నరేశ్, జాయింట్ సెక్రటరీగా హేమ, ఏడిద శ్రీరామ్ కూడా ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
2019లో నరేష్ వర్సెస్ శివాజీరాజా….
2019లో మా ఎన్నికలు చరిత్రలో లేనంతగా రచ్చకెక్కాయి. అప్పటి వరకు ఒకే ఫ్యానెల్లో ఉన్న శివాజీ రాజా , నరేష్ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. 745 మంది సభ్యుల్లో 472 మంది సభ్యులు ఓటు వేశారు. రాజాకు 199 ఓట్లు రాగా నరేశ్‌కు 268 ఓట్లు వచ్చాయి. 69 ఓట్ల మెజార్టీతో నరేష్ గెలిచాడు.
2021లో ఏం జరుగుతోంది…
ఇక ఇప్పుడు మా లో మొత్తం 925 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 600 ఓట్లు పోలవ్వవచ్చని అంచనా. వీరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారు విజేత అవుతారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ఉంటుంది.