Moviesఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచి విష్ణు..ఏం పెట్టాడో మీరు ఓ...

ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచి విష్ణు..ఏం పెట్టాడో మీరు ఓ లుక్కేయండి..!!

దసరా పండగ అనంతరం నిర్వహించే ‘అలయ్-బలయ్’ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌‌లో సందడిగా కొనసాగింది. నగరానికి చెందిన సీనియర్ బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌదర్యరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు, కాంగ్రెస్ నేత మల్లు రవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, టీజేసీ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు హాజరయ్యారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ధ్య దూరాన్ని పెంచాయ‌నే టాక్స్ వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల‌ని చాలా మంది మంచు ఫ్యామిలీ వ‌ర్సెస్ మెగా ఫ్యామిలీగా కామెంట్ చేశారు. అయితే రీసెంట్ గా  మంచు విష్ణు.. తన సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది.అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మం వీడియో షేర్ చేయ‌గా, ఇందులో చివ‌ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ కనిపిస్తున్నాడు. అయితే మంచు విష్ణు వీడియో చివ‌రలో ఉంది ఎవ‌రో గెస్ చేయండ‌ని ట్వీట్ చేశాడు.ఈ వీడియో అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకయ్యనాయుడు జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. గవర్నర్ తమిళిసై మహిళతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గుస్సాడీ నృత్యాలు, ఆదివాసీలు, గిరిజనులు, థింసా కళాకారులు, సదర్ దున్నపోతులు, బోనాలు, పీర్లు విశేషంగా అలరించాయి.

 

Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T

— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021

Latest news