కోలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులతో కొన్ని రోజులు ఇక్కడ అడ్రస్ లేకుండా పోయాడు. 2017లో గృహం సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వగా.. అదే యేడాది అక్టోబర్ 7న చైతు – సమంత పెళ్లి అయ్యింది. ఇక్కడ వీరి ప్రస్తావన ఎందుకంటే అంతకు ముందు వరకు సిద్ధార్థ్ – సమంత ప్రేమలో ఉండడంతో పాటు సహజీవనం కూడా చేశారన్న టాక్ ఉంది. తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. ఇక ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ అదే అక్టోబర్ నెలలో.. ఈ అక్టోబర్‌లోనే మహాసముద్రం సినిమాతో మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
కాకతాళీయమో ఏమో గాని ఇదే అక్టోబర్‌లో సమంత – చైతు విడాకులు తీసుకున్నారు. ఇలా సిద్ధు నాలుగేళ్ల క్రితం ఇక్కడకు అక్టోబర్‌లో వచ్చినప్పుడే సమంత – చైతును పెళ్లాడింది. ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ అదే అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వగా చైతుకు సమంత విడాకులు ఇచ్చేసింది. ఇలా సిద్ధార్థ్ ఇక్కడకు రీ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా సమంత లైఫ్ ఏదో కారణంగా టర్న్ అవుతోంది.
సిద్ధార్థ్ మహాసముద్రంకు డబ్బింగ్ చెప్పేందుకు హైదరాబాద్ వచ్చి రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ టైంలోనే సమంత విడాకుల ప్రకటన చేసింది. దీనికి తోడు సమంత చైతు నుంచి విడిపోయినట్టు ప్రకటన చేసిన వెంటనే పెట్టిన ట్వీట్ కూడా గతంలో సమంత తనను మోసం చేసిందన్న అర్థం వచ్చేలా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే సిద్ధార్థ్ తన ట్వీట్లో మోసం చేసే వాళ్లు ఎప్పటకి అయినా మంచిగా బతకలేరనే అర్థంతో ట్వీట్ చేశాడు.