Moviesభానుప్రియ అందానికి ఫిదా అయిన ఆ నిర్మాత ఏం చేసాడొ తెలుసా..?

భానుప్రియ అందానికి ఫిదా అయిన ఆ నిర్మాత ఏం చేసాడొ తెలుసా..?

భానుప్రియ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కప్పుడు తన అందంతో తన నటనతో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన అందాల తార. టాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించింది భానుప్రియ. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన భానుప్రియకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సుమన్ హీరోగా ‘సితార’సినిమాతో భానుప్రియ హీరోయిన్ గా తెరపై కనిపించింది. అన్వేషణ, ఆలాపన వంటి సూపర్ హిట్ చిత్రాలు భానుప్రియ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

అయియే కెరీర్ పీక్ టైం లో ఉన్నప్పుడే అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ని వివాహం చేసుకున్న ఈమెకు.. ఒక పాప పుట్టింద్ది. కొంత కాలం బాగానే సాగిన వీళ్ల కాపురం..ఆ తర్వాత కౌశల్ తో అభిప్రాయ భేదాలు రావడంతో ఇండియా వచ్చేసారు. ప్రస్తుతం కొన్ని క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ..వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ మళ్లీ ఫాం లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు భానుప్రియ. అయితే ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

తన నటనతో ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న భానుప్రియ పై ఓ నిర్మాత కన్నుపడింది. ఈ క్రమంలోనే ఆ నిర్మాత తన సొంత బ్యానర్ లో భానుప్రియతో కలిసి ఓ సినిమా చేయాలని..చాలా విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పరిస్ధితులు పసిగట్టిన భానుప్రియ ఆయన్ను దూరం పెట్టింది..ఆయన బ్యానర్ లో సినిమాలు చేయడానికి నో చెప్పింది. దీంతో ఆ నిర్మాతకు కోపం వచ్చి.. భానుప్రియ పై పగ పెంచుకుని..తనకున్న పలుకుబడితో భానుప్రియకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా చేసి .. తన కెరీర్ ను నాశనం చేయడానికి ఆ నిర్మాత కారణమయ్యారు. అయితే ఆమె ఎలాగోలా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news