టాలీవుడ్లోనే మోస్ట్ రొమాంటిక్ కఫుల్గా పేరున్న నాగచైతన్య – సమంత విడాకులు తీసేసుకున్నారు. ఇది కేవలం అక్కినేని అభిమానులకే కాకుండా… తెలుగు సినిమా అభిమానులకు కూడా కాస్త బాధగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇంత సడెన్గా విడాకులు తీసుకోవడం ఏంటి ? ఏం జరిగింది ? అన్నది ఎవ్వరికి అర్థం కాని విషయం. అయితే నెల రోజుల నుంచే సమంత మాత్రం చైతుకు తాను దూరమైనట్టు హింట్ ఇస్తూనే వచ్చింది.
వీరు ప్రేమలో ఉండగానే ఒకరి పేరు మరొకరు చేతిపై టాటూ వేయించుకున్నారు. మనం చైతు పేరు సామ్ చేతిపై.. సామ్ పేరు చైతు చేతిపై ఉండడం చూశాం. ఓ వైపు సమంత సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసినప్పటి నుంచి ఏవేవో అర్థాలు వచ్చేలా పోస్టులు పెడుతుంటే.. చైతు మాత్రం సెలెంట్గానే ఉన్నాడు. అయితే చైతు కూడా విడాకుల ప్రకటన చేయడానికి ముందే తన చేతిపై ఉన్న టాటూను తీసేయించుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని కొందరు గుర్తించినా ఏం జరిగిందో అన్న సందేహంతో ఉన్నారే తప్పా నిజంగా చైతు విడాకులకు సిద్ధమవుతున్నారా ? అన్న విషయం గుర్తించ లేకపోయారు. అయితే చైతు టాటూ తీసేసిన కొద్ది రోజులకే విడాకుల ప్రకటన కూడా చేశాడు.