Movies'నాట్యం' ఫేమ్‌ సంధ్యారాజు ఎవరింటి కోడలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

‘నాట్యం’ ఫేమ్‌ సంధ్యారాజు ఎవరింటి కోడలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఉపాసన,ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, వెంకటేశ్‌, చిరంజీవి లాంటి ప్రముఖులు నాట్యం చిత్రాన్ని ప్రమోట్‌ చేయడంతో ఈ సినిమాకు తొలి నుంచే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది

ఇక అది అలా ఉంటే అసలు ఆ నాట్యం హీరోయిన్ సంధ్యా రాజు ఎవరు.. అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. సడెన్‌గా వచ్చి ఇంత పెద్ద సినిమా ఎలా తీశారంటూ అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రామ్ చరణ్ హాజరు కావడం ఏంటీ.. ఎన్టీఆర్ టీజర్‌ను విడుదల చేయడం ఏంటీ అని చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్ అయితే ఏకంగా హైదరాబాద్‌లోని సంధ్యా రాజు ఆఫీస్‌కి వెళ్లి టీజర్‌ను విడుదల చేశారు. స్వయంగా ఎన్టీఆర్ వెళ్లి రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..?? ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలకు ఈమె ఎవరంటే..

 

సంధ్య రాజు బ్యాగ్ గ్రౌండ్ చాలా పెద్దది అని తెలుస్తోంది. సంధ్య రాజు ఒక మంచి కూచిపూడి నృత్యకారిణి మాత్రమే కాదు.. ఒక బిగ్ పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు.. అంతేకాదు మరో పెద్ద బిజినెస్ మ్యాన్ కోడలు. వేల కోట్లకరు అధిపతి, రాంకో సిమెంట్‌ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామరాజు పెద్ద కుమార్తెనే సంధ్యారాజు.

అంతేకాకుండా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్నకోడలు. సంధ్యారాజు స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. పేరు, ప్రఖ్యాతలున్న కుటుంబంలో పుట్టినా ఆమె స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news