తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఎవరికి వారు ఎత్తులు, పై ఎత్తులు వేయడంతో మా ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు లాగారు. జీవితా రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఓ ఫంక్షన్‌లో తాను జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశానని.. ఈ క్రమంలోనే తాను మీరు నాకు ఓటేయాలని అడిగినట్టు చెప్పారు.
అప్పుడు ఎన్టీఆర్ దయచేసి నన్ను అడగవద్దు… ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే తనకు బాధ వేస్తుందని అన్నారని.. నిజంగానే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని జీవిత చెప్పారు. ఇక జీవిత చెప్పిన మాటలను బట్టి చూస్తే ఎన్టీఆర్ మా ఎన్నికల విషయంలో అంత ఇంట్రస్ట్‌గా లేడనే అర్థమవుతోంది. ప్రత్యక్షంగా కాని.. పరోక్షంగా కాని ఎవ్వరికి సపోర్ట్ చేయడనే తెలుస్తోంది.
ఇక మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడిన జీవిత మోహన్‌బాబు గారు, విష్ణు అంటే తనకు ఎంతో గౌరవం అని.. విష్ణు తన సామర్థ్యంతో పోటీ చేయడానికి ముందుకు వచ్చారని.. అయితే నరేష్‌ను వెంటేసుకుని తిరగడం కరెక్ట్ కాదని ఆమె చెప్పారు. ఇక మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని తీసుకు రావడం కరెక్ట్ కాదని కూడా జీవిత తెలిపారు.