బిగ్ బాస్..సీజన్ 5. చూస్తూ చూస్తూనే ఆరు వారలు కంప్లీట్ చేసుకునింది. అయినా కానీ హౌస్ లో రచ్చలు..మనస్పర్ధలు..గొడవలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరు తామే టైటైల్ విన్ అవుతాం అంటూ..ధీమా వ్యక్తొ చేస్తున్నారు. రోజుకో టాక్ పేరుతో బిగ్ బాస్ తన స్ట్రాటజీ ఫాలో అవుతూ.. స్నేహంగా ఉన్న కంటెస్టేంట్స్ మధ్య చిచ్చులు పెట్టడానికి చూస్తున్నాడు. ఇక యాంకర్ రవి అయితే తనకున్న తెలివితేటలను మొత్తం ఆటలో పెట్టేసి మరీ ఆడుతున్నాడు.
ఇక ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆడియన్స్ వేసే ఓట్లు ఆధారంగా ఒక్క కంటెశ్Yఏంట్ ఎలిమినేట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే హౌస్ నుండి ఐదుగురు కంటెస్టేంట్స్ ఇంటిని వీడి వెళ్లిపోయారు. తాజాగా ఆరో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది శ్వేతా వర్మ. మొదట్లో ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు..కానీ బిగ్ బాస్ హౌస్ లో కి ఎంటర్ అయ్యాక తన పేరుని అందరికి తెలిసేలా చేసుకుంది శ్వేత వర్మ.
ఎన్నో అంచనాలతో బిగ్బాస్ తెలుగు సీజన్ 5లోకి అడుగుపెట్టిన శ్వేత వర్మ.. ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో బిగ్బాస్ షోతో ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యింది. మొదట్లో కాస్త సైలెంట్ గానే ఉన్న ఆ తర్వాత ఒకానొక నామినేషన్స్ లో ఉగ్రరూపం చూపించి..తానేంటో అందరికి చూయించింది. అయితే శ్వేత వర్మ హౌజ్లో అందరితో కలివిడిగా ఉంటూ ఐదు వారాలు నామినేషన్లోకి రాలేదు. ఆరోవారం హౌజ్లో ఉన్న పదిమంది సభ్యులు నామినేట్ కాగా, అందులో శ్వేత ఉంది. ఈ క్రమంలో శ్వేతిని ఆరో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేశారు.
కాగా ఆమె ఉన్న ఇన్నిరోజులకి గాను శ్వేత.. బిగ్బాస్ నుంచి ఎంత సంపాదించిందని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఆమెకు రూ. 60- 90 వేల వరకు ఇస్తున్నారట.. ఈ లెక్కన చూసుకుంటే ఆ ఆరు వారాలకి గాను సుమారు 5 లక్షల వరకు బిగ్ బాస్ ఆమెకు ముట్ట జెప్పిందన్నట్లు టాక్ వినిపిస్తుంది.