Moviesచైతుతో విడాకులు... స‌మంత త‌న త‌ప్పుకు ఫ్యూచ‌ర్‌లో అనుభ‌విస్తుందా ?

చైతుతో విడాకులు… స‌మంత త‌న త‌ప్పుకు ఫ్యూచ‌ర్‌లో అనుభ‌విస్తుందా ?

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడాకులుపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో ప‌లువురు ఇది చాలా బాధాక‌ర‌మైన న్యూస్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చినా కూడా అటు అక్కినేని అభిమానుల‌తో పాటు సామ్ అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ వీరిద్ద‌రు క‌లిసే ఉండాలంటూ ఆకాంక్షించారు. అయితే శ‌నివారం మ‌ధ్యాహ్నం చైతు – సామ్ వేర్వేరుగా సోష‌ల్ మీడియాలో ఒకే పోస్టును షేర్ చేస్తూ తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఎట్ట‌కేల‌కు వీరి విడాకుల వార్త ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.

వీరి విడాకుల వ్య‌వ‌హారం గురించి తెలిసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌మంత‌తే త‌ప్పు అని చ‌ర్చించు కుంటున్నారు. ముందు నుంచి కూడా స‌మంత అభిప్రాయానికే ఎక్కువ విలువ ఇచ్చేవాడ‌ట‌. చైతు ఎప్పుడూ కూడా ఆమెను ఎంతో ప్రేమిస్తూ… ఆమె త‌న‌పై ఎంత ఆధిప‌త్యం చెలాయించినా కూడా ఎక్క‌డా ఆ ఫీలింగ్‌ను వ్య‌క్త‌ప‌రిచే వాడు కూడా కాద‌ట‌. వాస్త‌వంగా చెప్పాలంటే నాగ‌చైత‌న్య వ్య‌క్తిత్వం కూడా అలాంటిది కాదు.

ఇండ‌స్ట్రీలో కూడా బ‌య‌ట ఆయ‌న గురించి తెలిసిన వారు సైతం చైతు చాలా మృదుస్వ‌భావి అని… ఎప్పుడూ ఎవ్వ‌రిని నొప్పించేందుకు ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌ర‌నే అంటారు. స‌మంత విష‌యంలోనూ చైతు అలాగే ఉండేవాడు. బ‌య‌ట వాళ్ల మ‌న‌స్సుల‌ను చిన్న‌గా క‌ష్ట‌పెట్టేందుకే ఇష్ట‌ప‌డ‌ని చైతు.. ఇక తాను ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లాడిన స్టార్ హీరోయిన్ స‌మంత‌ను మాత్రం ఇబ్బంది పెడ‌తాడ‌ని అస్స‌లు అనుకోలేం.

అయితే మితిమీరిన ఇగోయిజంతో పాటు చైతు కంటే తానే పేద్ద స్టార్ హీరోయిన్‌ను అనుకునే ఆమె మ‌న‌స్త‌త్వం.. దీనికి తోడు తాను తెలుగులో మాత్ర‌మే కాకుండా అటు త‌మిళ్లోనూ స్టార్‌నే అనుకునే ఫీలింగ్‌తో పాటు అక్కినేని లాంటి సాంప్ర‌దాయ ఫ్యామిలీలో అడుగు పెట్టినా కూడా చాలా అస‌భ్య‌క‌ర‌మైన వస్త్ర‌ధార‌ణ.. అటు నాగార్జు, అమ‌ల‌ను ఎంత మాత్రం గౌర‌వించ‌క‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తోనే అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు చైతు తీవ్రంగా విసిగిపోయార‌ట‌.

చైతు కొద్ది రోజులుగా ఎంత క‌న్విన్స్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కూడా ఆమె దిగి రాక‌పోవ‌డం.. ఇంకా త‌న‌కేదో ఛాన్సులు వ‌స్తాయ‌ని.. అన్న ధోర‌ణితో ఉండ‌డంతోనే చివ‌ర‌గా విడాకులు అంగీక‌రించాడ‌ని అంటున్నారు. ఏదేమైనా చైతుకు అటు కోట్ల ఆస్తి ఉంది. కెరీర్ ప‌రంగాను అంత ఇబ్బంది లేదు. స‌మంత గ్రాఫ్ తిరోగ‌మ‌నంలో ఉంది. మ‌రో రెండేళ్ల త‌ర్వాత ఆమెను ప‌ట్టించుకునే వాళ్లే ఉండ‌క‌పోవ‌చ్చు. ఆమె చేసిన త‌ప్పుకు ఆమె బాధ‌ప‌డే రోజు కూడా త్వ‌ర‌లోనే ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news