టాలీవుడ్లోనే కాకుండా సౌత్‌లో హీరో, హీరోయిన్లకు అమ్మ పాత్రలో నటించి సెంటిమెంట్ సీన్లు పండించడంలో స్పెషల్ అయిన పవిత్రా లోకేష్ అందరికి తెలిసిన నటే. 1994లో కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె కెరీర్ ఆరంభంలో మంచి హిట్లు కొట్టినా తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోలేక నిలదొక్కు కోలేకపోయింది. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు కూడా ఆమె కెరీర్ ట్రాక్ తప్పడానికి కొంత వరకు కారణం అయ్యాయంటారు.
అప్పట్లో ఇండస్ట్రీకి దూరమైన ఆమె బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా పని చేసింది. ఇదిలా ఉంటే ఆమె సెకండ్ ఇన్సింగ్స్‌లో మాత్రం మంచి క్యారెక్టర్లతో దూసుకుపోతోంది. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి పవిత్ర స్పందిస్తూ తనకు ఇండస్ట్రీలో చాలా మంది తెలిసిన వాళ్లు ఉన్నా కూడా తనకూ ఈ సమస్య తప్పలేదని వాపోయింది. అయితే తాను చాలా చాకచౌక్యంగా ఈ కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకున్నట్టు చెప్పింది.
ఇదిలా ఉంటే తాను ఓ సినిమా నటుడితో ప్రేమలో పడి మోసపోయాయని చాలా కాలంగా వార్తలు ఉన్నాయని.. అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని కొట్టి పడేసింది. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఈ రూమర్ తనపై ఎందుకు వచ్చిందో తెలియదని పవిత్ర తెలిపింది. తనను చిన్నప్పటి నుంచే తల్లి దండ్రులు చాలా స్ట్రిక్ట్‌గా పెంచడంతో ప్రేమ, గీమ లాంటి వాటిపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చేసింది.