కన్నడ పవర్ స్టార్ పునీత రాజ్‌కుమార్ కోట్లాది మంది సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచేసి వెళ్లిపోయారు. 46 సంవత్సరాల వయస్సులో గుండె పోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. విచిత్రం ఏంటంటే ఈ రోజు ఉదయమే ఆయన భజరంగీ 2 సినిమా యూనిట్‌కు అభినందనలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. జిమ్‌లో ఉదయం వర్కవుట్ చేస్తోన్న టైంలో ఆయనకు చాతి నొప్పిగా ఉందని చెప్పారట.
పునీత్‌కు ప్రతి రోజు జిమ్‌లో ఎక్కువ టైం వర్కవుట్ చేయడం అలవాటు. ఫిట్నెస్ కోసం వర్కవుట్స్ విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడేవారు కాదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. చాతి నొప్పి ఉందని చెప్పడంతో ముందుగా ఆయన్ను ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించిందని వైద్యులు చేతులు ఎత్తేయడంతో అనంతరం ఆయన్ను విక్రమ్ హాస్పటల్‌కు తరలించారు.
అయితే వైద్యులు అప్పటికే పరిస్థితి విషమించిందని.. హాస్పటల్‌కు తీసుకు రావడం ఆలస్యమైందని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. విక్రమ్ హాస్పటల్‌కు వచ్చే సరికే రాజ్‌కుమార్ చనిపోయాడని తెలుస్తోంది. అదే చాతి నొప్పి ఉందని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్స్‌లో ఆయన్ను విక్రమ్ హాస్పటల్‌కు తీసుకు వచ్చి ఉంటే ఆయన బతికి ఉండేవారన్న ఆశలు అయితే ఉన్నాయి.
ముందు ఓ హాస్పటల్‌కు తీసుకు వెళ్లడం.. అక్కడ ఆలస్యం అవ్వడం.. ఆ తర్వాత విక్రమ్ హాస్పటల్‌కు తీసుకు వెళ్లడంతో చాలా టైం అక్కడే వేస్ట్ అయిపోయింది. అప్పటికే పరిస్థితి విషమించింది.