సినిమా రంగంలో రాణించాలంటే అందం, అభినయం మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే ఇక్కడ రాణిస్తారు. అయితే ఇక్కడ వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా పురుషుల కంటే హీరోయిన్లు, మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మోసపోవడం ఖాయం. చూడచక్కని రూపం, కావాల్సినంత అభినయం ఉండి కూడా స్టార్‌గా ఎదగలేకపోయింది జయలలిత.
ఒకప్పుడు క్లాసికల్ డ్యాన్సర్‌గా పేరున్న జయలలిత కెరీర్‌పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. వినోద్ అనే మళయాళ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వినోద్ ఎక్కువుగా బీ గ్రేడ్ సినిమాలు చేసేవాడు. జయలలిత అతడి డైరెక్షన్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. వినోద్ తండ్రి జయదేవ్ కూడా మంచి దర్శకుడు. అయితే ఓ సినిమాకు జయలలితకు తెలియకుండానే వాళ్ల నాన్న డేట్లు ఇచ్చాడు.
అయితే జయలలిత ఆ సినిమా చేయడం కుదర్లేదు. అప్పుడు ఆ దర్శకుడి మనుషులు జయలలితను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు వినోద్ ఆ సమస్య నుంచి జయలలితను బయట పడేశాడు. ఆ టైంలో ఏర్పడిన సాన్నిహిత్యంతో అతడితో ప్రేమలో పడింది. ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వినోద్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంతో మంది చెప్పినా అప్పటికే ప్రేమ మైకంలో ఉన్న ఆమెకు అవేవి ఎక్కలేదు.
ఆ టైంలో కెరీర్ పరంగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది. చివరకు పెళ్లయ్యాక అతడు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడింది. ఇటు కెరీర్ పోయింది. ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.