అయిపోయింది..అంతా అయిపోయింది.. పదేళ్ల స్నేహ బంధం..4 ఏళ్ల వివాహ బంధం.. కోట్లాది మంది అభిమానులు ఆశీశులు అన్నీ మటలో కలిసిపోయాయి. యంగ్ హీరో నాగ చైతన్య, సమంతలు వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మొగుడు పెళ్లాలుగా విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తమ డైవర్స్ స్టేట్మెంట్‌ను రిలీజ్ చేశారు. ఇద్దరం ఒకరికి ఒకరు దూరం ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
గత కొన్ని రోజుల నుండి ఈ విషయమై డిస్కషేన్స్ జరుగుతున్నా.. ఎక్కడో ఒక్క మూళ వీళ్లు కలుస్తారులే..ఈ విడాకుల వార్తలు రూమర్స్ లే అని కొట్టి పారేస్తున్న అభిమానులకు ..కొద్దిసేపటి క్రితమే నాగ చైతన్య షాకింగ్ న్యూస్ వినిపించాడు. మేం విడిపోతున్నాము అంటూ ట్వీట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. దాదాపు దశాబ్ధ కాలం పాటు తమ మధ్య స్నేహం కొనసాగిందని, అదే తమ మధ్య బంధాన్ని బలపరిచినట్లు చైతన్య తెలిపాడు. అది ఎప్పటికీ మరువలేనిదన్నాడు. క్లిష్ట తరమైన సమయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని చైతూ తన ట్వీట్‌లో కోరాడు.
అయితే సమంత నాగ చైతన్య విడాకులు పై అక్కినేని అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ చాలా భయపడ్డారు. కానీ నాగ చైతన్య అభిమానులు మాత్రం వీళ్ళ విడాకులను చాలా లైట్ గా తీసుకున్నారు. ఎందుకో తెలియదు కానీ మొదట నుండి అక్కినేని అభిమానులకు సమంత కోడళ్లు గా వాళ్ళకు నచ్చలేదు. ఇక ఇప్పుడు వాళ్ళు విడిపోతుండడంతో..అభిమానులు చైతన్యకి రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ బ్రో..మంచి పని చేసావ్..సమంత పీడ ఈ రోజుతో నీకు పోయింది..ఇక నైన హ్యాపీగా ఉండూ.. సెకండ్ ఇన్నింగ్స్ కు ఆల్ ది బెస్ట్..అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరైతే అయ్య..పాపం..ఈ చూడ చక్కని జంట పై ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో అంటూ బాధపడుతున్నారు.