వెంకటేశ్..తన తండ్రి ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నేతృత్వంలో కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొంతమంది హీరోలలాగా తీసుకున్న కథనే మరీమరీ తీసుకుంటూ ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ఉండకుండా, విభిన్న కథలతో ఎప్పటికప్పుడు తనలో ఉన్న మేకోవర్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, సినీ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే ఇప్పటికే వెంకటేష్ తన 35 సంవత్సరాల సినీ కెరీర్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతారు. ఆయన పనేదో ఆయన చేసుకోవడం మినహా బయట విషయాలు ఆయన పెద్దగా పట్టించుకోరు. నారప్పతో ప్రేక్షకులను మెప్పించిన వెంకీ దృశ్యం 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే తాజాగా ఆయన ఇన్స్‌స్టా స్టోరీగా పెట్టుకున్న కొటేషన్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చదివిన ఎవరైనా సరే..అది నాగ చైతన్య సమంత ల గురించి ట్రోల్ చేసే వారికే అని అనుకుంటారు.
ఇంతకి ఆయన ఏమని పోస్ట్ చేసారో తెలుస..??.. “నోరు తెరిచి మాట్లాడే ముందు కాస్త బుర్ర కూడా ఓపెన్ చేయాలి” అంటూ సున్నితమైన మెసేజ్‌తో రూమర్స్ వ్యాప్తి చేస్తున్న అందరి నోరు మూయించే ప్రయత్నం చేశారు వెంకటేష్. దీంతో ఈ కొటేషన్ నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం అక్కినేని కుటుంబ సభ్యులకు, అలాగే దగ్గుబాటి వారి కుటుంబ సభ్యులకు మింగుడు పడటం లేదని తెలుస్తుంది.