సమంత నాగచైతన్య విడిపోయిన తరువాత కూడా మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ జంటా..ఆ తరువాత సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికి..అవి ఏమి పట్టించుకోకుండా..వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు. ఇక సమంత కూడా విడాకుల విషయం నుండి భయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.
అయితే .. వీళ్లు సైలెంట్ గా ఉన్నా కూడా ప్రీతమ్ జుకల్కర్ మాత్రం ఏదో ఒక్క కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. సమంత విడాకుల విషయంలో తన పర్సనల్ స్టైలీష్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఒకరని.. అతడితో సమంత స్నేహంగా ఉండడం.. పైగా సమంత బర్త్ డే రోజు తన కాళ్లు అతడి ఒళ్లో పెట్టుకుని పడుకున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో రకరకాల సందేహాలు వస్తున్న క్రమంలో.. విడాకులు ఇచ్చాక అవి ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే తాజాగా ప్రీతమ్ జుకల్కర్ పెట్టిన పోస్ట్ ఒక్కటి లేని పోని అనుమానాలకు దారితీస్తుంది.
‘అబద్ధాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయి. ఎంత దాచిపెట్టినప్పటికీ ఏదో ఒక రోజు అవి బయటపడుతాయి’ అని ఇన్ స్టా స్టోరిలో ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే.. ఈ స్టోరీ పెట్టిన కొద్ది సేపటికే ప్రీతమ్ తను పెట్టిన పోస్ట్ డిలిట్ చేసేసాడు. అసలు పోస్ట్ పెట్టడం ఎందుకు ..మళ్లీ వెంటనే దాని డిలిట్ చేయడం ఎందుకు అంటున్నారు పలువురు సెలబృఇటీస్..అంతేకాదు ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టి ఉంటాడనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఏమో చైతూ వేరే అమ్మాయితో ఎఫైర్ ఉండడం వల్లనే సమంత విడాకులు ఇచ్చిందని ఇప్పుడు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.