బొమ్మరిల్లు సినిమాతో ఒక్కసారిగా బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు ఆ సినిమా దర్శకుడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో పరుగు, రామ్‌చరణ్‌తో ఆరెంజ్ సినిమా చేశాడు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత అసలు భాస్కర్‌ను పట్టించుకునే వారే లేరు. రామ్‌ను మెప్పించి ఒంగోలు గిత్త చేసినా డిజాస్టర్ అయ్యింది. లాంగ్ గ్యాప్ తీసుకుని అక్కినేని హీరో అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తీసి ఎట్టకేలకు హిట్ కొట్టాడు.
భాస్కర్ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అయితే అతడు ఓ తెలుగు అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. బొమ్మరిల్లు సినిమా హిట్ అయ్యాక భాస్కర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ టైంలోనే భాస్కర్‌కు పెళ్లి చేసేయాలని సంబంధాలు చూడడం మొదలు పెట్టారట ఆయన తండ్రి. ఓ అమ్మాయిని చూసి భాస్కర్‌కు మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారట.
అయితే భాస్కర్ వెంటనే తండ్రికి ఫోన్ చేసి.. తాను శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో మ్యారేజ్ చేసుకుంటున్నాని.. మీరు కూడా వచ్చేయాలని చెప్పాడట. అలా తండ్రికి ట్విస్ట్ ఇచ్చాడట భాస్కర్. ఇంతకు ఆ అమ్మాయి మన తెలుగు అమ్మాయే ఆమెది విజయనగరం. ఆమె పేరు గౌరీ శ్రీ విద్య.