Moviesమళ్లీ వాళ్లనే నమ్ముకుంటున్న భాస్కర్.. దెబ్బఅయిపోడు కదా..?

మళ్లీ వాళ్లనే నమ్ముకుంటున్న భాస్కర్.. దెబ్బఅయిపోడు కదా..?

చాలా సంవత్సరాల తరువాత సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు డైనమిక్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు తో టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పేషల్ స్టేటస్ సంపాదించుకున్న ఈయన..ఆ తరువాత ఆ పేరు పైకి తీసుకెళ్లడ కాదు కదా.. కొన్ని సినిమాల తరువాత అసలు బొమ్మరిల్లు సినిమా తీసింది ఈయననేనా అన్నట్లు అనిపించాడు. అంత డిజాస్టర్ గా నిలిచాయి ఈయన మూవీస్.

ఇక ఎలాగోలా అల్లు అరవింద్ ని పట్టి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా ను తీసాడు. దాదాపు రెండున్నారెళ్లు పాటు తీసిన ఈ సినిమా రీసెంట్ గా విడుదలై ఘన విజయం కాదుకానీ..మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. పెద్దగా స్టోరీ లేకపోయినా..పూజా తొడ అందాలు..కొన్ని కామెడీ సీన్స్.. కొంచెం హాట్ రొమాన్స్ తో కలి కొట్టి..సినిమాను ఫినిష్ చేసాడు. ఈ సినిమాకు మయిన్ ప్లస్ పాయింట్ సంగీతం..ఈ సినిమాలోని పాటలు అందరిని ఆకటుకున్నాయి.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ అవ్వడంతో భాస్కర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అతనికి మరికొన్ని బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. కానీ భాస్కర్ మాత్రం తొందర పడకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారట. కాగా తనకు హిట్ ఇచ్చిన గీత ఆర్ట్స్ సంస్ధ తోనే మరొక సినిమా చేయాలని డిసైడ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.

 

ఇప్పుడు భాస్కర్ పై నమ్మకంతో గీతాఆర్ట్స్ సంస్థ మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరోకి సెట్ అయ్యే కథని రెడీ చేసుకోమని చెప్పిందట గీతాఆర్ట్స్ సంస్థ. మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ తో భాస్కర్ మరో ఛాన్స్ కొట్టేశాడనే చెప్పాలి. మరి ఈసారి ఎలాంటి కథను రెడీ చేసుకుంటారో చూడాలి!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news