Moviesమరో సంచలనానికి తెర తీసిన బాలయ్య... వాళ్లకు మాటిచ్చేసారుగా..!!

మరో సంచలనానికి తెర తీసిన బాలయ్య… వాళ్లకు మాటిచ్చేసారుగా..!!

వెండితెర పై దూసుకుపోతున్న నటసింహం కన్ను ఇప్పుడు సడెన్ గా బుల్లితెరపై పడిన్నట్లుంది. అందుకే వరుస గా షోలు హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా బ్రాండున్న బాలయ్య వరుసగా టీవీషోలని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికెర ఆహా ఓటిటిలో ‘అన్‌స్టాపబుల్‌’ షోకి హోస్టింగ్ చేయనున్నట్లు అదికారిక ప్రకటన్ కూడా వచ్చేసింది. దీపావళి సందర్భంగా నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. గురువారం ఈ కార్యక్రమం కర్టెన్‌ రైజర్‌ జరుగగా అందులో బాలయ్య తాన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి షోపై అంచనాలని అమాంతం పెంచేశాడు.

అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మరో సంచలనానికి తెరతీసిన్నట్లున్నారు బాలకృష్ణ. బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో సంవత్సరాలు గడుస్తున్నా మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇతర ఛానెళ్లలో కూడా కామెడీ షోలు ప్రసారమవుతున్నా ఆ షోలు జబర్దస్త్ కు గట్టి పోటీ ఇవ్వడంలో ఫెయిల్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో విఫలవుతున్నాయని తెలుస్తుంది. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో జ‌బ‌ర్ధ‌స్త్ వేదిక‌పై నుండి జడ్జి రోజా.. లైవ్ లోనే బాల‌కృష్ణ‌కి కాల్ చేస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసిన బాలయ్య..హా రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని మరోసారి అందరి ముందు నిరూపించుకున్నారు. నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో నేను అఖండ షూటింగ్ లో ఉన్నానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక రోజా మళ్లీ మనం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దాం అని అడగ్గా.. బాలకృష్ణ నవ్వి తప్పుకుండా చేద్దాం.. మన కాంబినేషన్ కోసం అందరు ఎదురుచూస్తున్నారు అంటాడు.

అంతేకాదు.. జబర్దస్త్ షోకి జడ్జీగా కూడా వస్తాను.. మీ అందర్నీ కలుస్తాను అని మాట ఇచ్చారు బాలయ్య. దీంతో రోజా థాంక్యూ సో మచ్ సార్ అంటారు. అనంతరం బాలయ్య.. ఆది, రాఘవ వీళ్లంతా ఎలా ఉన్నారు అని కూడా అడిగారు. అక్కడ అభి, రాఘవ నా కంటే పెద్దవాళ్ళు అంటూ ఫోన్ లో పంచులు పేల్చాడు బాలయ్య. ఇక రోజా బాలయ్యకి ఫోన్ చేసింది నిజమే కానీ అయితే.. మాట ఇచ్చాడు కాబట్టి జబర్దస్త్ కి బాలకృష్ణ రావటం పక్కనే అంటున్నారు ఫ్యాన్స్.

Latest news