నాగ్ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీకి మంచి టాక్ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ స్థాయిలో బజ్ రావడం.. హిట్ టాక్‌కు తోడు మంచి ఓపెనింగ్స్ రావడంతో ఇండస్ట్రీ జనాలకు మంచి ధైర్యం వచ్చింది. ఇక ఫస్ట్ వీక్ కూడా పూర్తయ్యింది. కానీ వసూళ్లు చూస్తే మాత్రం అంత సంతృప్తి లేదు. కొన్ని ఏరియాల్లో భారీ నష్టాలు తప్పవంటున్నారు. ప్రధానంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనే లవ్ స్టోరీకి దెబ్బ పడేలా ఉంది.
ఏపీలో టిక్కెట్ల రేట్లు తగ్గించాలన్న నిబంధనలకు తోడు బీ, సీ సెంటర్లతో పాటు మల్టీఫ్లెక్స్‌లపై ప్రభుత్వ నిఘా ఎక్కువుగా ఉండడంతో ఎవ్వరూ పరిధి దాటి ఎక్కువ రేట్లకు అమ్మడం లేదు. దీనికి తోడు చాలా చోట్ల జనాలకు ఇంకా సినిమాలు చూసేందుకు ముందుకు కదలడం లేదు. ఇవన్నీ ఇక్కడ లవ్ స్టోరీకి దెబ్బేశాయి.వెస్ట్, సీడెడ్‌లో లవ్ స్టోరీకి గట్టి నష్టాలు తప్పవనే అంటున్నారు.
ఈ రెండు చోట్లా ఇంకా కోటి రూపాయల చొప్పున రికవరీ ఉన్నట్టు ట్రేడ్ గుసగుస…! ఇదే శేఖర్ కమ్ముల ఫిదా వైజాగ్ ఏరియాలో లాంగ్ రన్లో రు. 4 కోట్లకు పైగా రాబట్టింది. లవ్ స్టోరీ ఇప్పటికి రు. 2 కోట్లు రాబట్టినా.. లాంగ్ రన్లో ఫిదా మార్క్ చేరదనే అంటున్నారు. ఇక నైజాంలో కేసీఆర్ ప్రభుత్వం నుంచి పెద్దగా ఒత్తిళ్లు అయితే లేవు.
ఈ క్రమంలోనే అక్కడ ఇప్పటి వరకు రు. 10 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఫిదా ఇక్కడ లాంగ్ రన్లో రు. 18 కోట్లు రాబట్టగా.. లవ్ స్టోరీ ఆ మార్క్‌కు చేరదనే అంటున్నారు. దసరా వరకు స్టడీగా ఉంటే ఇక్కడ మరింత మంచి వసూళ్లు రావొచ్చు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం నిర్మాతకు మంచి లాభాలే వచ్చాయంటున్నారు.