పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న “భీమ్లా నాయక్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ తో పాటు ఇంట్రో టీజర్లు రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. అయితే ఈ సినిమాకి కొన్ని భారీ ఆఫర్స్ వస్తున్నాయి. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సముఖంగా లేకపోయినప్పటికీ కూడా కొన్ని ఓటీటీ సంస్థలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఆఫర్స్ అయితే ప్రకటిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చిత్ర నిర్మాతలకు మైండ్ బ్లాకింగ్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “భీమ్లా నాయక్” సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే అమెజాన్ మాత్రం డైరెక్ట్ గా తమ ఓటీటీలో రిలీజ్ చేయాలని పెద్ద ఆఫర్ చిత్ర బృందం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ను థియేటర్ల లో రిలీజ్ చేస్తే హిట్ టాక్ వస్తే రు. 100 కోట్ల షేర్ సులువుగా వసూలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా రు. 150 కోట్ల ఓటీ టీ ఆఫర్ వచ్చిందన్న వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.