25 ఏళ్ళక్రితం ఘనవిజయం సాధించిన పెళ్లి సందడి టైటిల్‌తో రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లిసందడ్ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీలీల తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పెళ్ళిసందడ్’. దసరా కానుకగా రేపు అంటే అక్టోబర్ 15న విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలకి విశేషదారణ దక్కింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణ కాబట్టి.. గ్లామర్ కు కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రీలీల కూడా తన నటనకు మంచి మార్కులే వేయించుకుంది. చక్కటి అమదంతో తన ముద్దు ముద్దు మాటలతో సీనియర్ హీరోలను సైతం ఫిదా చేసింది. అయితే తాజాగా ఈమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ శ్రీలీల నా కూతురు కాదు అంటున్నారు వ్యాపరవేత్త సూరపనేని శుభాకర రావు.పెళ్ళిసందడ్ హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు అంటూ మీడియాకి ఎక్కరు వ్యాపరవేత్త సూరపనేని శుభాకర రావు. ఆమె నా మాజీ భార్య కూతురు అంటున్నారు.
మేము విడిపోయిన తరువాత ఆమెకు శ్రీలీల పుట్టిందని. అసలు ఆ బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుతున్నారు.నాతో విడిపోయిన తరువాతే నా మాజీ భార్య శ్రీలీల కు జన్మనిచ్చిందని ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు. కేవలం నా ఆస్తులపై క్లైమ్ చేయడానికి నా పేరు వాడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అంతేకాదు ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్తాం అంటూ హెచ్చరించారు . దీంతో ఇప్పుడు పెళ్ళిసందడ్ హీరోయిన్ శ్రీలీల మిడియాలో హాట్ టాపిక్ గా మారింది.