టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్ని సినిమాల్లో నటించినా ఆయన నటించిన అన్నమయ్య సినిమా ఆయన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరుడి భక్తుడు అన్నమయ్యగా నాగార్జున నటన అద్భుతం. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
1 – అన్నమయ్య రచయిత జెకె. భారవి ఈ కథను రాసుకుని దర్శకుడు రాఘవేంద్రరావుకు జస్ట్ వినిపిద్దామని వెళ్లారు. ఈ కథ విన్న వెంటనే రాఘవేంద్రరావు రు. 10 వేలు చేతిలో పెట్టి ఈ కథ పూర్తిగా డవలప్ చేసి తనకే ఇవ్వమని వెంటనే అడగడం.. భారవి ఓకే చేసేయడం జరిగిపోయాయి.
2 – ఈ సినిమా చేసేందుకు ముందుగా నాగార్జున ఒప్పుకోలేదు. అన్నమయ్యగా తాను సెట్‌కానేమోనని.. అంత నిగ్రహం పాటించలేమోనన్న సదేహం నాగార్జునకు ఉండేది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం నాగార్జున కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డ ఇంట్లోనే ఉండేవారు.
3 – అంతకు ముందే నిన్నే పెళ్లాడతా హిట్ నాగార్జునకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ పోతుందని.. అన్నమయ్య చేయవద్దని కృష్ణవంశీ కూడా నాగార్జునకు చెప్పారు.
4 – ఈ సినిమాలో ఉన్న పాటలు రిలీజ్‌కు ముందు చాలా మందిలో సందేహం రేకెత్తించాయి. ఇన్ని పాటలతో అసలు సినిమా ఆడుతుందా ? అన్న అనుమానాలు రిలీజ్ అయ్యాక పటాపంచలు అయ్యాయి. అన్నమయ్య విజయంలో కీరవాణి పాటలు చాలా హైలెట్ అయ్యాయి.
5 – 1997 మే 22వ తేదీన అన్నమయ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొత్తం 42 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
6 – ఈ సినిమా అప్పట్లోనే నిర్మాతలకు రు. 10 కోట్ల షేర్ రాబట్టింది.
7 – ఈ సినిమాకు పోటీగా విక్టరీ వెంకటేష్ – అంజలా ఝవేరి నటించిన ప్రేమించుకుందాం రా వచ్చి 55 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
8 – అన్నమయ్య రిలీజ్ అయ్యాక 5 రోజుల తర్వాత జగపతిబాబు – ఇంద్రజ నటించిన ఒక చిన్నమాట మూవీ వచ్చింది. ఇది ఎబో యావరేజ్.
9 – అన్నమయ్య రిలీజ్ అయ్యాక 8 రోజుల తర్వాత రాజశేఖర్ – సౌందర్య నటించిన మా ఆయన బంగారం వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.
10 – అన్నమయ్య రిలీజ్‌కు మూడు వారాల ముందు శ్రీకాంత్ – రమ్యకృష్ణ నటించిన ఆహ్వానం వచ్చి. అది కూడా హిట్ అయ్యింది. ఇలా ఇన్ని సినిమాల పోటీ మధ్యలో కూడా భక్తిరస చిత్రం అన్నమయ్య మంచి హిట్ అవ్వడంతో పాటు ప్రేక్షకులను మెప్పించింది.. ఈ రోజుకు టాలీవుడ్ చరిత్రలోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది.