మన టాలీవుడ్‌లో నటుడు శ్రీను తెలుసా ? అంటే చాలా మంది ఏ శ్రీను అంటారు.. అదే ప్రభాస్ శ్రీను తెలుసా అంటే ఓ ఎందుకు తెలియదు.. సూపర్ కామెడీ యాక్టర్ కదూ..! అని ఒక్కసారిగా ప్రశంసలు కురిపించేస్తుంటారు. తెలుగు సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే ప్రభాస్ శ్రీనుకు సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అసలు శ్రీను , ప్రభాస్ శ్రీను ఎలా ? అయ్యాడు.. మనోడు ప్రభాస్‌కు ఎక్కడ క్లాస్‌మెట్ అన్నదానిపై ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీనే స్వయంగా చెప్పాడు.
ప్రభాస్ శ్రీనుకు చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదట. అయితే సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేవాడట. ఎక్కువుగా కల్చరల్ యాక్టివిటీస్ చేసేవాడట. ఇదే విషయాన్ని శ్రీను నాన్న తన స్నేహితుడికి చెప్పడంతో ఆయన సలహా ద్వారా మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేర్పించమన్నారట. అక్కడ కొద్ది రోజులు శిక్షణ తీసుకున్నా కూడా శ్రీనుకు ఎలాంటి ఛాన్సులు లేవట.
అయితే సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకుంటే ఛాన్సులు వస్తాయని.. కెరీర్ బాగుంటుదని కొందరు చెప్పారట. అయితే సత్యానంద్ గారు ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వరు. అప్పుడు ప్రభాస్ శ్రీను నాన్న ఆర్డీవోగా పని చేస్తున్నారట. ఆయన రికమెండేషన్ చేయడంతో సత్యానంద్ గారు ప్రభాస్ శ్రీనుకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.
ఆ బ్యాచ్‌లో నలుగురు ఉండేవాళ్లట. అందులో ప్రభాస్ కూడా ఒకరు. ఇక రాఘవేంద్ర సినిమా నుంచి తాను ప్రభాస్‌తోనే ఉన్నానని.. ప్రభాస్ లేకపోతే శ్రీనుకు విలువ లేదని చెప్పుకువచ్చాడు.