మంజుల ఘట్టమనేని.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ కూతురుగా ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంజుల.. స్టార్ హీరోయిన్గా ఎదగాలనుకుంది. కానీ, వచ్చిన అవకాశాలన్నిటీ ఆమెనే సున్నితంగా తిరస్కరించింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ.. మంజులు ఆ అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకుంది.
ఇందుకు కారణం కృష్ణ అభిమానులే. తమ అభిమాన హీరోల వారసులను ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకున్నారు. కానీ, హీరోల కూతుర్లు మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి ఇతర హీరోలతో స్టెప్పులు వేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకునే వారు కాదు. అలానే మంజుల సినిమాలో నటించడానికి కృష్ణ గారి అభిమానులు ఒప్పుకోలేదు.
కొందరు అభిమానులైతే ఏకంగా పెట్రోల్ చేత పట్టుకుని తను సినిమాలలో నటిస్తే ఇక్కడే నిప్పంటించుకొని చచ్చిపోతా మంటూ బెదిరించారు. దాంతో అభిమానుల మనోభావాలను దెబ్బ తీయలేక మంజుల నటించనని చెప్పేసింది. ఇందులో భాగంగానే బాలయ్య, డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి కాంబోలో తెరకెక్కిన `టాప్ హీరో` మూవీని సైతం రిజెక్ట్ చేసింది. దాంతో ఆమె ప్లేస్‌లో సౌందర్య నటించగా.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.