మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక మాంచి ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న చిరు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న ఆచార్య సినిమా చేస్తున్నారు. ఆచార్య షూటింగ్ కూడా ఎండింగ్‌కు చేరుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు చిరు గాడ్ ఫాదర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మళయాళంలో హిట్ అయిన లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. మోహనరాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మళయాళంలో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో అలనాటి మేటినటి శోభనతో చేయించాలని నిర్ణయించుకున్నారట.
గతంలో శోభన చిరు కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. రౌడీ అల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమా లో కూడా వీరిద్దరు కలిసి నటించారు. మళ్లీ రెండున్నర దశాబ్దాల తర్వాత వీరు వెండితెరపై జంటగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ పాత్రలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.