Moviesఎన్టీఆర్ తల్లి షాలిని గురించి తెలియని షాకింగ్ ఫాక్ట్స్..!

ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి తెలియని షాకింగ్ ఫాక్ట్స్..!

నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఈ త‌రం జ‌న‌రేష‌న్లో తిరుగులేని స్టార్ హీరో. ఆయన తల్లి షాలిని మాత్రం తెరవెన‌కే వుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఎదిగినా సరే , ఈమె మాత్రం బయట ప్రపంచానికి దూరంగానే ఉన్నారు. హ‌రికృష్ణ‌కు ఆమె రెండో భార్య అన్న సంగ‌తి తెలిసిందే..! షాలిని ఒక మ్యూజిక్ టీచర్. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు సంగీతాన్ని నేర్పించడానికి వచ్చేది.

ఎన్టీఆర్ కు చేదోడువాదోడుగా ఉండే హరికృష్ణ ఎప్పుడూ ఇంట్లోనే ఉండడంతో షాలిని తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇక ఒక్కొక్కసారి షాలినిని ఇంటిదగ్గర దిగబెట్టడానికి హరికృష్ణ స్వయంగా తీసుకెళ్లేవారు. ఇక ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే హరికృష్ణకు లక్ష్మితో వివాహం జరిగి జానకి రామ్‌ కూడా పుట్టాడు. అదే స‌మ‌యంలో హరికృష్ణ షాలినితో పెళ్లి కాకుండానే వేరే కాపురం పెట్టాడు.

ఈ విషయం వారి ఇంట తెలియడంతో షాలినినీ మ్యూజిక్ టీచర్ గా తొలగించారు. హరికృష్ణ మాత్రం ఇంట్లోవాళ్లు బెదిరించినా, భార్య కోప్పడిన కూడా షాలిని మీద ఉన్న ప్రేమను తగ్గించుకో లేకపోయాడు. ఆమె కూడా హ‌రికృష్ణ‌ను తప్ప వేరే ఒకర్ని భర్తగా ఊహించుకోలేన‌ని చెప్పేసింది. దీంతో హ‌రికృష్ణ ఆమెను కూడా భార్య‌గా స్వీక‌రించ‌క త‌ప్ప‌లేదు.

ఆ త‌ర్వాత ఆయ‌న ఆమెకు ఏనాడు కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నాడు. తర్వాత షాలినికి ఎన్టీఆర్ పుట్టాడు. ఎన్టీఆర్ పుట్టడంతో హరికృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు తనకు మనవడు పుట్టాడని… తన పేరునే ఎన్టీఆర్‌కు పెట్టాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news