సినీ ఇండస్ట్రీలో సాధారణంగా చాలా వరకు హీరోయిన్లు నమ్మే సూత్రం ఏదైనా ఉంది అంటే, అవకాశాలు వచ్చినప్పుడు నటించాలి.. డబ్బులను వెనకేసుకు కోవాలి.. అవకాశాలు తగ్గిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని చాలా మంది హీరోయిన్లు కూడా తమ స్టార్ స్టేటస్ బాగా కొనసాగినప్పుడు డబ్బులు వెనకేసుకొని , ఇక అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త లను పెళ్లి చేసుకున్నారు..అలా ఎవరెవరు బిజినెస్ మ్యాన్ ల ను వివాహం చేసుకొని.. సెటిలైన స్టార్ హీరోయిన్స్ ఉన్నారో తెలుసుకుందాం..!
1. శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా :
శిల్పాశెట్టి ముంబై లో ప్రముఖ వ్యాపారవేత్త గా గుర్తింపు పొందిన రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈయన అశ్లీల వీడియోల కేసులో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. దీంతో ఆమె విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
2. సోనం కపూర్ – ఆనంద్ ఆహుజా :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సోనం కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా ను వివాహం చేసుకున్నారు. ఆమె సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
3. ఈషా డియోల్ – భరత్ తక్తాని :
బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా, వజ్రాల వ్యాపారి భరత్ తక్తాని ని వివాహం చేసుకుంది.
4.టీనా మునిం – అనిల్ అంబానీ :
బాలీవుడ్లో నటిగా గుర్తింపు పొందిన టీనా రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ ని వివాహం చేసుకుంది. అప్పట్లో వీరి ప్రేమ వివాహం దేశంలోనే పెద్ద సంచలనం అయ్యింది.
5.అశిన్ – రాహుల్ శర్మ:
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె, మైక్రోమాక్స్ సీఈఓ అయిన రాహుల్ శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశిన్ గజిని సినిమాతో ఇండియా వైజ్‌గా సూపర్ పాపులర్ అయ్యింది.
6. కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు:
దక్షిణ సినీ ఇండస్ట్రీలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ , ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది.
7.రీమా సేన్ – శివ్ కరణ్ సింగ్:
ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రీమాసేన్ రీమా రెస్టారెంట్ అధినేత శివ కరణ్ సింగ్ ను వివాహం చేసుకుంది.