Moviesఈ హీరోయిన్ ని చెప్పుతో కొట్టడానికి వచ్చిన ఆ స్టార్ హీరో...

ఈ హీరోయిన్ ని చెప్పుతో కొట్టడానికి వచ్చిన ఆ స్టార్ హీరో తల్లి..ఎందుకో తెలుసా..??

సినిమా పరిశ్రమలో నటి నటుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఎపుడు సెన్సేషన్నల్ గానే ఉంటాయి. ఈ విషయంలో బాలీవుడ్‌లో మరీ ముందుంటుంది. ఎవరు ఎవరితో రేలేషన్ షిప్ లో ఉన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటాయి. హీరో, హీరోయిన్స్ లో కూడా ఇలాంటి రెలేషన్స్ కామన్ గా కనిపిస్తుంటాయి.”ఆ హీరో హీరోయిన్‌ రిలేషన్‌లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్‌లో ఉంటున్నారు” అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.ఓ సినిమాలో కలిసినటించినప్పుడు అభిప్రాయాలు, మనసులు కలుస్తాయి. అవి ప్రేమలో పడేలా చేస్తాయి.ఇలా ఎందరో హీరో హీరోయిన్ లు పెళి చేసుకున్నారు.

1970 దశకంలో ఇలాంటి లవ్‌ట్రాక్‌ వార్తలు ఎక్కువగా అప్పటి హీరోయిన్‌ రేఖ గురించి వచ్చేవి. అందం, అభినయంతో ఉత్తమ నటిగా ఎందరో అభిమానాన్ని, ఎన్నో అవార్డులను దక్కించుకున్న రేఖ గురించి.. మీడియాలో మాత్రం ఎక్కువగా వచ్చే వార్తలు ఆమె లవ్‌ ట్రాక్‌కు సంబంధించినవే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అందగత్తె రేఖ. దక్షిణాదికి చెందిన ఈ భామ యావత్ భారతాన్ని తనవైపుకు తిప్పుకుంది. 66 సంవత్సరాల రేఖ నటజీవితం దేదీప్యమానంగా వెలిగింది కానీ వ్యక్తిగత జీవితం మాత్రం విఫలమైంది. కానీ ఈమె నటనకు ప్రేక్షకులు ఈమెకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా పట్టంకట్టారు. అంతేకాకుండా నటి రేఖ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఇక అలనాటి హీరో వినోద్ ని ప్రేమించిన విషయంలో ఆమె అప్పట్లో బాగా వైరల్ గా మారింది.

వినోద్‌ మెహ్రా, రేఖతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. కానీ ఆయన కుటుంబం మాత్రం రేఖను అంగీకరించలేదు. ముఖ్యంగా వినోద్‌ మెహ్రా తల్లి వీరిద్దరి బంధాన్ని గట్టిగా వ్యతిరేకంచేవారు. ఇక అలా వీరిద్దరి ఫ్యామిలీకి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు.అలా వివాహం చేసుకున్న తర్వాత వినోద్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాగా.. అక్కడ వినోద్ వాళ్ళ అమ్మ ఈమె నచ్చకపోవడంతో ఆమె మీదికి చెప్పు ఎత్తిందట కొట్టడానికి.

కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన సమయంలో ఘోర అవమానం జరగడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్లిపోయిందట. వినోద్ మెహ్రా ఇంట్లో అంతగా అవమానం జరగడంతో కొన్నాళ్ల తర్వాత మనం కలిసి ఉండలేమని నిర్దారించుకున్న తర్వాత విడిపోయారట. ఆ తర్వాత 1990 లో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ ని పెళ్లి చేసుకుంది రేఖ. అయితే అనూహ్యంగా ఏడు నెలల కాపురం చేయకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు ముఖేష్. ఇక ఆ తరువాత ఈమె మళ్ళి పెళ్లి చేసుకోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news