ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఎంత ప్రమాద కరంగా మారిందో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. కొందరు సోషల్ మీడియాను బేస్ చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటే .. మరి కొందరు మోసాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే సైబర్ లెక్కల ప్రకారం 2019తో పోలిస్తే ఈ సైబర్ మోసాలు అనేవి 2020లో 3.7 శాతం పెరిగాయని తేలింది.
ఇక సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో చేసే స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెపుతున్నారు. ఇప్పుడు పోర్న్ సైట్లు లెక్కకు మిక్కిలిగా వచ్చేస్తున్నాయి. ఎక్కడ నుంచి ఏ లింక్ వస్తుందో ? తెలియదు.. దానిని ఓపెన్ చేసిన వెంటనే దీని వెనక ఉన్న ముఠా శృంగార వీడియోలు చూసేలా ప్రోత్సహిస్తుంది. అలా ప్రలోభ పెట్టిన తర్వాత మానసికంగా వారిని శృంగారం లేకుండా ఉండలేని స్థితికి తీసుకు వస్తుంది. అటు నుంచి అందమైన అమ్మాయిలతో వల విసిరి ఆ ఉచ్చులో పడేలా చేస్తుంది.
ఇంకే ముంది… మనకు తెలియని స్థితిలో మనం మన వీడియోలు, పర్సనల్ విషయాలు వారికి ఇచ్చేస్తాం.. లేదా అటు నుంచి అందమైన అమ్మాయిలతో న్యూడ్‌గా మాట్లాడే వీడియోలు కూడా మనకు తెలియకుండానే రికార్డు చేస్తారు. అక్కడ నుంచి ఆ ముఠాలు ఈ బాధితుల నుంచి డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. అలా మనం మన బాధలను ఎవ్వరికి చెప్పుకోకుండానే అన్ని విధాలా నష్టపోతాము.
ఇందుకు కొన్ని ఉదాహరణలు చూస్తే యూపీలో ఓ మాజీ ప్రియుడు తన ప్రేయసితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఆమె తన తల్లితో సహా ఉరి వేసుకుంది. ఇక మరో కేసులో ఓ వివాహిత మాజీ ప్రియుడు తన పాత ఫోన్ అమ్మే ముందు ఆమెతో ఉన్న వీడియోలు, ఫొటోలను డిలీట్ చేయలేదు. ఆ తర్వాత అవి సోషల్ మీడియాలో రావడంతో ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అందుకే ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తోంది.