కరోనా కాలంలో రీల్ విలన్ కాస్త రీయల్ హీరో అయ్యిపోఆరు సోనూసుద్. కరోనా మహమ్మారి తాండవించిన సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్చాలామందికి అండగా నిలిచాడు. వందలాది మందికి సాయం అందించారు. ఈ సేవాగుణం కారణంగా దేశవ్యాప్తంగా ఆయనకు లక్షలాది మంది అభిమానులు అయిపోయారు. పెద్దపెద్ద సెలెబ్రెటీలు సైతం ఆయనను ప్రశంసించారు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను అధికారులు సోనూ సూద్ ఇంట్లో సర్వే చేశారు. సోను సూద్ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో, ఆదాయపు పన్ను అధికారులతో పాటు, సోనుసూద్ కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంది. నటుడు సోనూసూద్‌పై ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేసిన తర్వాత, అతనిపై రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు కేసు వెలుగులోకి వచ్చిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది.
కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు వెల్లడించారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం తాజాగా సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఎమెషనల్ పోస్టును పోస్ట్ చేశారు.
సోమవారం తన ట్విట్టర్ నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతి పౌరుడి ప్రార్థనలు ప్రభావం చూపుతాయి, గతకుల రోడ్డుపై కూడా ప్రయాణం సాఫీగా సాగిపోతుందని చెప్పిన సోనూసూద్.
“భారతీయులకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదలను కాపాడటానికే. మానవీయ కోణంలో కొన్ని కొత్త బ్రాండ్లను కూడా ప్రోత్సహించాను. అయితే గత నాలుగు రోజులుగా అతిథులు(ఐటీ అధికారులు)తో బిజీగా ఉండిపోయాను. మీకు సేవ చేసుకోలేకపోయాను. మళ్లీ మీ జీవితాల్లోకి తిరిగొచ్చాను” అంటూ సెటైరికల్‌గా తన స్పందనను తెలియజేశారు సోనూసూద్.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021