బాయ్స్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగులో బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, కొంచె ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో మంచి విజయం అందుకున్న సిద్దార్థ గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమయ్యాడు. వాస్తవానికి మనోడు ఆ మద్య నటించిన ఒక్క సినిమా హిట్ కాకపోవడంతో తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో ఈ సారి మహా సముద్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్..ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
అయితే ఇటీవల జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు సినిమా యూనిట్ సభులు అందరు హాజరు అయ్యారు. కానీ సిద్ధార్త్ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన అభిమానులకి ఎందుకు సిద్ధూ డుమ్మా కొట్టారా..? అంటూ కొట్ట అనుమానాలు పుట్టుకొచ్చేలా చేసాయి. అయితే అసలు రీజన్ దర్శకుడు అజయ్ భూపతి చెప్పేసారు. సిద్ధార్త్ ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు అని.. అందుకే ఈ ఈవెంట్కు ఆయన హాజరుకాలేకపోయారు అని అజయ్ తెలిపారు.
ఇప్పుడు టాపిక్ మరింత హాట్ గా మారింది అసలు గుట్టు చప్పుడు కాకుండా సిద్ధూ లండన్ కి వెళ్లి మరి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పని ఏంటని..? ఇంత సడన్ గా లండన్ వెళ్లాల్సిన అవసరం ఎంటని చాలా మంది ని వేధిస్తున్న ప్రశ్న ఇది. హీరో సిద్ధార్థ్ లండన్ వెళ్లడానికి ఒక బలమైన కారణం ఉందని తన అభిమానులు అంటున్నారు. మరి చూడాలి ఈ విషయమై ఆయన నోరు విప్పుతాడో లేదో..??