ప్రస్తుతం డ్రగ్స్ ఉదంతం టోటల్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న పలువురు హీరోస్ కి, హీరోయిన్ లకి, సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఇక నేటి నుంచి వంతుల వారిగా ఒక్కోసెలెబ్రిటీ విచారణకు హాజరు అవుతుంటారన మాట. ఇక ఈ ప్రాసేస్ సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతూనే ఉంటుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయాడు. ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ఆధారంగా 6 నెలల క్రితం ఈడీ అధికారులు కెల్విన్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. దీంతో కెల్విన్ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.
కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం. భారీ మొత్తంలో నగదు బదిలీ చేసిన సినీతారల బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా కెల్విన్ ఈడీ అధికారుల ముందు అప్రూవర్‌గా మారడంతో సదరు సినీ ప్రముఖులు ఇరకాటంలో పడ్డట్టు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.