పవన్ కళ్యాణ్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. వకీల్ సాబ్ తో తిరుగులేని విజయం అందుకున్న పవన్ ..ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు పవన్. పవన్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాను శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఏఎం. రత్నం నిర్మిస్తున్నారు.
ఇక ఆ తరువాత క్రేజీ కాంబినేషన్ గా పవన్ హారిష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా తీయబొతున్నాఉ. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక బండి మీద పుస్తకంతో పాటుగా ఆ పోస్టర్ లో స్వాతంత్య్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలను ఉంచారు.ఈ ఫొటోలు చూస్తే దేశభక్తికి సినిమాలో హీరోకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే పవన్‌తో సినిమా చేసేందుకు మైత్రీ మూవీస్ వారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. తర్వాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యంగా పట్టాలు ఎక్కుతోంది.
క్రిష్ సినిమా కంప్లీట్ చేసి హరీష్ శంకర్ ప్రాజెక్టులో పవన్ జాయిన్ అవుతాడు.హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా, ఇది దేశ భక్తి నేపథ్యంలో రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని తెలుస్తుంది. సినిమా కథకి టైటిల్‌కి సరిగ్గా సరిపోతుందని మేకర్స్ ఈ టైటిల్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మొదట హీరోయిన్ గా సమంత ని అనుకోగా..ఫనల్ గా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.