Newsరీల్ లోనే కాదు.. రీయల్ లైఫ్ లోను ఎన్నో తప్పులు చేశా..అజయ్...

రీల్ లోనే కాదు.. రీయల్ లైఫ్ లోను ఎన్నో తప్పులు చేశా..అజయ్ సంచలన వ్యాఖ్యలు..!!

అజయ్ తెలుగు సినీ నటుడు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్‌ హీరోలకు సమానంగా గుర్తింపు పొందాడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు. అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ గురించి తెలియని వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సహాయక నటుల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అజయ్ విక్రమార్కుడు సినిమాలో పోషించిన విలన్ పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. న‌టుడు అజ‌య్.. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు,ఛ‌త్ర‌ప‌తి వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన అజయ్‌ ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మమ అనిపిస్తున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అజయ్‌ తన జీవితంలో జ‌రిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తను సినిమాల్లోనే కాదు బయట కూడా తప్పులు చేశానంటూ ఆయన ఎదురుకున్న విషయాలు గురించి హెబుతూ.. ‘19 ఏళ్ల వయసులో ఇంట్లో డబ్బులు తీసుకుని ఫ్రెండ్‌తో నేపాల్‌ పారిపోయాను. అక్కడ మూడు నెలలు సరదాగా గడిపాం. ఆ తర్వాత తిరిగి రావడానికి డబ్బులు లేవు. ఇంటికి రావ‌డానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో అక్క‌డ హోట‌ల్‌లో గిన్నెలు క‌డిగాడ‌ట‌.

ఇలా జీవితంలో చాలా త‌ప్పులు చేశాన‌ని చెప్పుకొచ్చాడు అజ‌య్. ఇక తన కాలేజీ స్నేహితురాలు శ్వేతని ప్రేమించి ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నానని తరువాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. అయితే అజయ్‌ నటుడిగా బిజీగా ఉంటే భార్య శ్వేతా రావూరి పలు ఈవెంట్స్‌ పార్టిసిపేట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉండేవారట.అజ‌య్ త‌న భార్య‌తో బ‌య‌ట క‌నిపించడం చాలా అరుదు. తాజాగా అజ‌య్, శ్వేత ఇద్ద‌రు ఫొటోల‌కు ఫోజులివ్వ‌గా ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news