Moviesజగపతి బాబు సంచలన నిర్ణయం..మంచిదేగా అంటున్న సినీ పెద్దలు..?

జగపతి బాబు సంచలన నిర్ణయం..మంచిదేగా అంటున్న సినీ పెద్దలు..?

జగపతి బాబు..ఒక్కప్పుడు టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా అందరి మనసులను గెలుచుకున్న ఈ హీరో..ఇప్పుడు విలన్ గాను అందరిని ఆకట్టుకుంటున్నారు. క‌థానాయ‌కుడిగా ఎంత గుర్తింపు పొందారో ప్ర‌తినాయ‌కుడిగా అంత‌కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు జ‌గ‌ప‌తి బాబు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్ రొమాంటిక్ హీరో జగపతి బాబు.. ఆయన నటన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను బాగా ఆకట్టుకుంటుంది.విలన్, కేరెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో దక్షిణాది భాషల్లో దూసుకెళ్తున్న నటుడు జగపతి బాబు.

 

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు. అనుకోకుండా కొని ఆర్ధిక కారణాల చేత సినిమాలకు కొంచం గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామ‌గా మెప్పిస్తున్నారు . ప్రస్తుతం జగపతి బాబు చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం సలర్ మూవీ, వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమా, టక్ జగదీష్ సినిమా, అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న సినిమా, కన్నడ లో ఒక సినిమా, మహా సముద్రం సినిమా, లక్ష్య సినిమా, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే ఇప్పుడు జగపతిబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పై జగపతిబాబు సినిమాల్లో లాభాలను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచన మార్చుకొని లాభాలు తీసుకుంటే బాగుంటుందని.. నిర్మాతలు కూడా ఆయనకు అదే సలహా ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.జగపతిబాబు తనకున్న డిమాండ్ అని అర్థం చేసుకుని రెమ్యూనరేషన్ కంటే లాభాల్లో వాటా తీసుకోవడమే బాగా ఉంటుందని భావిస్తున్నారట. అప్పుడు సినిమాలో నష్టం వచ్చిన లాభం వచ్చిన నిర్మాతకు ఇబ్బంది ఉండదు కాబట్టి జగపతి బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ లో ఎక్కువగా మాటలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమకి మూడు నుండి నాలుగు కోట్ల మధ్య తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో నటిస్తూ చాలా బిజీ అయిపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news